Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు క్రేజీ గిఫ్ట్ అనౌన్స్ చేసిన మారుతి

ఈ బుధవారం ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా రాజా సాబ్ నుంచి ఓ పోస్టర్ కావాలని అడిగారు ఫ్యాన్స్. వెంటనే ఇచ్చేశాడు రాజా సాబ్ దర్శకుడు మారుతి. పైగా ఆ స్టిల్ చూసి మళ్లీ మనోడు మిర్చి టైమ్ లో ఉన్నంత హ్యాండ్సమ్ గా ఉన్నాడని మురిసిపోయారు. దీంతో ఇక ఇదే బర్త్ డే గిఫ్ట్ అనుకున్నారు అభిమానులు. బట్ వారిని సర్ ప్రైజ్ చేస్తూ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి.
రాజా సాబ్ నుంచి టీజర్ లేదా మరో వీడియో గ్లింప్స్ రాబోతోందని చెప్పకనే చెప్పాడు. మరో కొత్త పోస్టర్ విడుదల చేసి హీ ఈజ్ అరైవింగ్ టొమారో అంటూ ఓ క్యాప్షన్ పెట్టారు. అంటే రేపు ప్రభాస్ వీడియో ఒకటి విడుదల కాబోతోంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించి అందుకు అనుగుణంగానే.. ఓ పురాతనమైన గదిలో రివర్స్ లో ఉన్న ఓ సింహాసనం.. దాని చివరన మంటలు అంటుకున్న పోస్టర్ విడుదల చేశాడు. అంటే ఈ సింహాసనం నుంచే రాజా సాబ్ దిగబోతున్నాడు అనుకోవచ్చా.. అలాగే తన పోస్ట్ లో కూడా మారుతి మరో మాట వాడాడు. ఆ మనిషి తను ఎక్కడికి చెందిన వాడో మళ్లీ అక్కడికే వస్తున్నాడు అన్నాడు. మొత్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది ఊహించని బహుమతే అనుకోవచ్చు. ఏదైనా మారుతి అభిమానులకు మరింత నచ్చేస్తాడీసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com