iBomma : ఐ బొమ్మ శకం ముగిసినట్టేనా..?

iBomma : ఐ బొమ్మ శకం ముగిసినట్టేనా..?
X

టాలీవుడ్‌ను వణికించిన పైరసీ సామ్రాజ్యానికి మూలస్తంభంగా భావిస్తున్న ఐ బొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌ సంచలనంగా మారింది. ఈ దెబ్బతో సినీ పరిశ్రమ ఒక పెద్ద ఊపిరి పీల్చుకున్నట్టైంది. రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని చేతుల మీదుగానే ఐ బొమ్మ, బప్పం వంటి పలు పెద్ద పైరసీ వెబ్‌సైట్లను అధికారికంగా మూసివేయించారు. సైబర్ నిఘా సంస్థల ప్రకారం రవి పైరసీ వల్ల టాలీవుడ్‌కు ఏకంగా రూ. 22 వేల కోట్ల వరకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. విశాఖపట్టణానికి చెందిన రవి టెక్నికల్‌ స్కిల్స్‌లో అసాధారణ వ్యక్తిగా తేలిపోయింది. ఇతను ఎలాంటి వెబ్ సైట్ ను అయినా ఈజీగా హ్యాక్ చేసేయగలుగుతాడు.

ఎలాంటి సెక్యూర్‌ సైట్ అయినా హ్యాక్ చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్లకు కంటెంట్‌ను సులభంగా అప్‌లోడ్ చేసే టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి మనోడికి. కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన సర్వర్ల ద్వారా సినిమాలు అప్‌లోడ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని నిమిషాల్లోనే ప్యూర్ సినిమా కంటెంట్ ను అందించేవాడు. అయితే తాజాగా సైబర్ క్రైమ్ విభాగం అతి జాగ్రత్తగా చేసిన ఆపరేషన్‌లో రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపింది. అతను బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

రవిని అరెస్ట్ చేయడంతో అతని నెట్‌వర్క్ పూర్తిగా కుప్పకూలిపోయినట్లే. అతను లేకుండా ఐ బొమ్మ పైరసీ కార్యకలాపాలు జరగవు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఐ బొమ్మ సైట్లు తిరిగి రీ-యాక్టివేట్ అవడం కష్టమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రవి పైరసీ కొనసాగించే అవకాశం లేకపోవడంతో, భవిష్యత్తులో ఈ సైట్ పూర్తిగా కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది. టాలీవుడ్‌కు సంవత్సరాలుగా చికాకైన ఐ బొమ్మ శకం ఇలా ముగిసిందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు.


Tags

Next Story