Mayabazar Re-Release : మే23న మాయాబజార్ రీ రిలీజ్

Mayabazar Re-Release : మే23న మాయాబజార్ రీ రిలీజ్
X

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు, మహానటి సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు లాంటి దిగ్గజాలు నటించిన సినిమా మాయాబజార్. 1957లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ ప్రభంజనం. తెలుగు వారు ఇష్టపడే క్లాసిక్ చిత్రాల వరుసలో 'మాయాబజార్' ఎప్పటికీ ముందు స్థానంలో ఉంటుంది. తరాలు గడుస్తున్నా ఈ సినిమాపై వారికి ఉన్న ఆదరాభిమానాలు మాత్రం తగ్గలేదు సరికదా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల రీరిలీజ్ల ట్రెండ్ ఊపందుకున్న తరుణంలో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా కలర్ వెర్షన్లో బలుసు రామారావు విడుదల చేస్తున్నారు. శ్రీకృష్ణుడు గా ఎన్. టి. రామారావు, ఘటోత్కచుడు గా ఎస్. వి. రంగారావు, శశి రేఖగా సావిత్రి, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వర రావు ఆయా పాత్రలను సజీవంగా మన ముందు నిలబెట్టారు. "2023లో ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీని ఏర్పాటు చేశాము. ఎన్టీఆర్‌‌ను నమ్మి ఆచరించిన మహోన్నత ఆశయాలు, సిద్ధాంతాలు, విధానాల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో మేము ఎన్టీఆర్‌కు సంబంధించిన అపురూప గ్రంథాలను వెలువరించాము" అని జనార్ధన్ పేర్కొన్నారు.

Tags

Next Story