Meenakshi Chaudhary : క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్న మీనాక్షి

Meenakshi Chaudhary : క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్న మీనాక్షి
X

లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ బ్యూటీ. ఇక ఆమె చేసిన మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక తాజాగా మీనాక్షి మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకుందట. అదేంటంటే అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హారర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని అనుకుంటున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయం అధికారిక ప్రకటన రానుంది. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందా అనేది చూడాలి.

Tags

Next Story