Actors on Social Media : హ్యాపీ మూడ్లో మీనాక్షి, అదిరేటి డ్రెస్సులో దీపిక

'ఇచట వాహనాలు నిలుపరాదు 'మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిందీ అమ్మడు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హ్యాపీ మూడ్ లో ఉన్నట్టుందీ అమ్మడు. అందుకే ఇన్ స్టా వేదికగా ఫొటోలు షేర్ చేసింది. దీనికి క్యాప్షన్ గా హ్యాపీ మూడ్ లో ఉన్నానని రాసుకొచ్చింది. మీనాక్షి నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్లతో పాటు వ్యక్తి గత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చీర కట్టుకుని ట్రెడిషనల్ వేర్లో దర్శనమిచ్చింది. ఎప్పుడూ బోల్డ్ లుక్తో కనిపించే ఈ బ్యూటీ సడెన్ గా ఇలా చీరకట్టులో కనిపించి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
బాలీవుడ్ దీపికా పదుకొణే
బాలీవుడ్ అగ్రకథానాయిక దీపికా పదుకొణే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వడంతోపాటు తన ఫొటో షూట్లను షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తుంది. అదిరేటి డ్రెస్సులతో కుర్రకారును హుషారెక్కిస్తుందీ భామ. ఆమె ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్ గా కూడా నిలుస్తోంది. 2007లో ఓంశాంతి ఓం సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమాలో షారుక్ ఖాన్ తో ఆడిపాడింది. ఆమె అద్భుతమైన నటనకు బాలీవుడ్ ఫిదా అయ్యింది. దీంతో ఆమె అక్కడే సెటిలైపోయింది. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో స్టెలిష్ డ్రెస్ ధరించిన ఫొటోను షేర్ చేసింది. ఆ డ్రెస్ డీప్ మెరూన్ కలర్ ఉంది. ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉండటం గొప్ప ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె దానిని హై-వెయిస్ట్ జీన్స్ కాంబినేషన్ లో ధరించడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com