Kangana Ranaut : కంగనా ఓ యోధురాలు .. మీరా చోప్రా ప్రశంసలు

Kangana Ranaut : కంగనా ఓ యోధురాలు .. మీరా చోప్రా ప్రశంసలు
X

కంగనా రనౌత్‌పై బాలీవుడ్‌ నటి మీరా చోప్రా ప్రశంసలు కురిపించారు. ఆమె ఓ యోధురాలని.. ఆమెలా మరెవ్వరూ పోరాడలేరన్నారు. ‘కంగనా సరైన సమయంలో రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకొని విజయం సాధించారు. ఆ రంగంలోనూ త్వరలోనే తన మార్కును చూపుతారు. నేను కంగనాకు పెద్ద అభిమానిని. సినీ రంగంలో ఆమె ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలతో బయటపడ్డారు. ఆమెలా మరెవ్వరూ చేయలేరు. ముక్కుసూటిగా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయని తెలిసినా.. వాటికి తలవంచి తన వ్యక్తిత్వాన్ని వదులుకోరు. రాజకీయాల్లో ప్రస్తుతం పలు వివాదాల్లో చిక్కుక్కున్నప్పటికీ ఆమె వాటిని ధైర్యంగా ఎదుర్కొగలరని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆమె ఒక యోధురాలు. భవిష్యత్తులో ఆమె గొప్ప రాజకీయవేత్త అవుతుంది’’ అంటూ కంగనాపై మీరా ప్రశంసలు కురిపించారు.

Tags

Next Story