Tollywood: వాయిదా పడిన టాలీవుడ్ కీలక భేటీ.. సినీ పెద్దలకు ఆసక్తి లేదంటూ టాక్..

Tollywood: వాయిదా పడిన టాలీవుడ్ కీలక భేటీ.. సినీ పెద్దలకు ఆసక్తి లేదంటూ టాక్..
Tollywood: ఇవాళ జరగాల్సిన టాలీవుడ్ కీలక భేటీ మరోసారి వాయిదా పడింది.

Tollywood: ఇవాళ జరగాల్సిన టాలీవుడ్ కీలక భేటీ మరోసారి వాయిదా పడింది. పలువురు సినీ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ సమావేశానికి చిత్ర పరిశ్రమలోని అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని టాక్ వినిపించింది. అయితే పలువురు ప్రముఖుల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై ఇప్పటికే సినీ ప్రముఖులు.. మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం మంత్రి పేర్ని నానితో సమావేశయ్యారు. ఇక వాదనలు.. ప్రతివాదనల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా ఏపీ సీఎం జగన్‌తో సమావేశమై.. సినిమాకు సంబంధించిన పరిస్థితులు, ఇబ్బందులు వంటి అంశాలపై చర్చించారు.

జగన్ చాలా సానుకూలంగా స్పందించారని.. సినీ పరిశ్రమ మేలు కోసమే సీఎంతో భేటీ అయ్యానని చిరంజీవి చెప్పారు. ఇవాళ జరగాల్సిన సమావేశంలో చిరు.. జగన్‏తో చర్చించిన అంశాల గురించి సినీ ప్రముఖులకు తెలిపే అవకాశం ఉందని టాక్ వినిపించింది. సినిమా టికేట్స్ రేట్స్, పరిశ్రమలోని ఇబ్బందులే ఏజెండాగా ఈ సమావేశం జరగాల్సి ఉన్న ఈ కీలక భేటీ చివరికి వాయిదా పడింది.

Tags

Read MoreRead Less
Next Story