Tollywood : మెగా కోడలు సతీ లీలావతి స్పీడప్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవమోహన్ ప్రధాన పాత్రల్లో తాతినేని సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా సతీ లీలావతి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయినట్లు లావణ్య త్రిపాఠి ప్రకటించింది. నిర్విరామంగా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఈ ఫస్ట్ షెడ్యూల్లో హీరో హీరోయిన్ల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టీం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com