Tamannaah : అవకాశాల వేటలో పడిన మిల్కీ బ్యూటీ

పదిహేనేండ్ల వయస్సుల్లోనే తెరంగేట్రం చేసిన భామ తమన్నా భాటియా. దాదాపు 20 ఏండ్లుగా పరిశ్రమలో రాణిస్తోందీ అమ్మడు. అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసిందీ బ్యూటీ. అలారెండు దశాబ్దాల మైలు రాయిని అవలీలగా టచ్ చేసింది. ఇప్పుడీ అమ్మడి వయస్సు 35 ఏండ్లు. జైలర్ చిత్రం, ఆ తరువాత హిందీ స్త్రీ 2 వంటి చిత్రాలలో తమన్నా స్పెషల్ సాంగ్స్ ఇరగదీసింది. అలాంటి మిల్కీబ్యూటీకి దక్షి ణాదిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు. ఇటీవల సుందర్ సీ దర్శకత్వంలో నటించిన అరణ్మణై - 4 చిత్రం కమ ర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కోలీవుడ్లో మరో అవకాశం రాలేదు. తెలుగులో నటించిన ఓదెల - 2 చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో అక్కడ మరో అవకాశం రాలేదు. అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ తమన్నాను పూర్తిగా పక్కన పెట్టేసిందా? అన్న చర్చ జరుగు తోంది. ప్రస్తుతం బీ టౌన్ నే నమ్ముకుందీ అమ్మడు. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. తమన్నా కన్నా వయసులో పెద్ద వారైన నయనతార, త్రిష వంటి తారలు నాలుగు పదుల వయసు దాటేసినా ఇప్పటికీ అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్నారు. మిల్కీబ్యూటీ కెరీర్ పై లవ్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఉందనే టాక్ వినిపిస్తోం ది. విజయ్ వర్మ అనే హిందీ నటుడి ప్రేమలో పడడం, అది కొద్ది కాలానికే వికటించడం వంటి ఘటనలు కెరీర్ ను దెబ్బతీశాయంటు న్నారు. ఏదేమైనా మిల్కీ బ్యూటీ మళ్లీ అవకాశాల వేటలో పడింది. తన గ్లామరస్ ఫొటోలతో ఇన్ స్టాలో సందడి చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com