సినిమా

Siva Reddy: ఫ్రెండ్ చేతిలో మోసపోయిన మిమిక్రీ ఆర్టిస్ట్.. ఏకంగా రూ. 70 లక్షలు..

Siva Reddy: టాలీవుడ్‌లో మిమిక్రీకి మంచి గుర్తింపు తీసుకొచ్చినవారిలో శివారెడ్డి పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

Siva Reddy (tv5news.in)
X

Siva Reddy (tv5news.in)

Siva Reddy: టాలీవుడ్‌లో మిమిక్రీకి మంచి గుర్తింపు తీసుకొచ్చినవారిలో శివారెడ్డి పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తాను మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయంలో మిమిక్రీని చాలావరకు ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ కొన్నాళ్లకే మిమిక్రీలో కింగ్‌గా వెలిగిపోయి.. పలు షోస్‌లో, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టాడు. అయితే తన ఫ్రెండ్ వల్ల తాను భారీ మోసాన్నే ఎదుర్కున్నాడని శివారెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

ఫ్రెండ్స్ అనేవారిని గుడ్డిగా నమ్మి మోసపోయినవారు ఎంతోమంది ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అలాంటి మోసాలను ఎదుర్కున్నవారు చాలామందే ఉంటారు. అందులో శివారెడ్డి కూడా ఒకడు. తన కెరీర్ మొదట్లో శివారెడ్డి కష్టపడి కూడబెట్టుకున్న రూ.70 లక్షల సొమ్మును ఒక ఇల్లు లేదా ల్యాండ్ కొనుగోలు చేయడానికి దాచిపెట్టాడట. అయితే ఈ విషయంలో తాను తన ఫ్రెండ్ సాయం కూడా తీసుకున్నాడట.

ఆ రూ.70 లక్షలు పట్టుకుని శివారెడ్డి, తన ఫ్రెండ్‌తో కలిసి ఇల్లు లేదా ల్యాండ్ కొనుగోలు చేయడానికి తిరిగారట. అయితే శివారెడ్డికి ఏదైనా ఇల్లు లేదా ల్యాండ్ నచ్చినప్పుడు అందులో ఏదో ఒక లోపం చెప్పవాడట తన ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ మాటలు విన్న శివారెడ్డి ఏది కొనకుండానే ఆగిపోయాడట. అయితే కొన్నాళ్ల తరువాత అమెరికాలో ఒక ఈవెంట్ కోసం చాలారోజుల వెళ్లాల్సి రావడంతో శివారెడ్డి తన డబ్బునంతా తన ఫ్రెండ్ వాళ్ల ఇంట్లోనే పెట్టేసి వెళ్లాడట.

శివారెడ్డి తిరిగి వచ్చేసరికి తన ఫ్రెండ్ రూ.70 లక్షలు ఖర్చు చేసేశాడట. ముఖ్యమైన పని ఉండడం వల్ల ఖర్చు అయిపోయాయని, కొన్ని రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని తన ఫ్రెండ్ అన్నాడట. కానీ ఇప్పటివరకు ఆ రూ.70 లక్షలు తన దగ్గరకు రాలేదని శివారెడ్డి అన్నాడు. ఒకవేళ ఆ డబ్బు తన దగ్గరే ఉండుంటే ఇప్పటికీ మణికొండలో తన దగ్గర ఇల్లు లేదా ల్యాండ్ ఏదైనా ఉండేది అని చెప్తూ బాధపడ్డాడు శివారెడ్డి.

Next Story

RELATED STORIES