Minister Ponguleti : అండర్ టన్నల్ పనుల్లో స్పీడప్ పెంచండి

Minister Ponguleti : అండర్ టన్నల్ పనుల్లో స్పీడప్ పెంచండి
X

పాలేరులో నాగర్జునసాగర్ ఎడమ కాలువపై చేపట్టిన యూటీ (అండర్ టన్నల్ ) నిర్మాణ పనులు వేగంగా చేయాలని మంత్రి పొంగులేటి ఇరిగేషన్ అధికారులను ఆదేశిం చారు. ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరులో పర్య టించి, జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాలు, వరదలతో యూటీ నిర్మాణ పనులు కుప్పకూలిన్నట్లు మంత్రి చెప్పారు. సాగు నీటి విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. అంతేకాక నిర్మాణాపు పనులు పదికాలాల పాటు మన్నికగా ఉండేలా నాణ్యత ప్రమాణా లు పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ‘రైతులకు సాగునీరు అందించేందుకు పనులు పూర్తి త్వరగా పూర్తి చేయాలి. సరిగ్గా ఇవాల్టి రోజు నుంచి అంటే జూలై 23 నాటికి య్యూటీ (అండర్ టన్నెల్ ) పనులు కంప్లీట్ చేయాలి. వచ్చేది వర్షాకాలం కాబట్టి పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా యుద్ధ ప్రాతిపదికన రెండు నెలల్లో పూర్తిచేసి జిల్లాలోని రైతులకు సాగునీరు అందించాలని పొంగులేటి అన్నారు. అనంతరం పొలేరు గ్రామంలో 37 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూర కాగా, అందులో ఆరుగు రికి మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, డీఈఈ పద్మజ, పలువురు అధికారులు ఉన్నారు.

Tags

Next Story