Tollywood : మిస్ యూ టీజర్ రిలీజ్

Tollywood : మిస్ యూ టీజర్ రిలీజ్
X

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్, అషికారంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తు న్న సినిమా మిస్ యూ టీజర్ రిలీజైంది. విజయ్ సేతుపతి ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. చాలా కాలంలో తర్వాత ఇండియన్-2 లో కనిపించిన సిద్ధార్త్ మిస్ యూ మూవీలో అషికా రంగనాథ్ తో ఆడిపాడబోతున్నాడు. ఈ సినిమాకు రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శామ్యూల్ మాథ్యూ నిర్మిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పా న్స్ ను దక్కించుకున్నాయి. తాజాగా, అషికా రంగనాథ్ 'మిస్ యు' అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నవంబర్ 12న ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ “ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉండండి. మిస్ యు మూవీ మీ సమీప థియేటర్లో నవంబర్ 29న వచ్చేస్తుంది” అనే క్యాప్షన్ జత చేసింది. మందుగా చెప్పినట్టుగానే మిస్ యూ టీజర్ విడుదలైంది

Tags

Next Story