Mohan Babu : మరోసారి విలన్ గా మోహన్ బాబు

Mohan Babu : మరోసారి విలన్ గా మోహన్ బాబు
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నాడు మోహన్ బాబు. ఆయన తన కెరీర్ లో అన్ని రకాల పాత్రలు చేశాడు. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన మరోసారి తన విలనిజాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అవును.. నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ అనే సినెమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా మొదలయ్యింది ఈ సినిమా. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో వైరల్ పాత్ర కోసం మోహన్ బాబును ఫిక్స్ చేశారట మేకర్స్. పాత్ర చాలా నచ్చడంతో మోహన్ బాబు కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మరి చాలా కాలం తరువాత విలన్ గా చేస్తున్న మోహన్ బాబు ఆడియన్స్ ను ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.

Tags

Next Story