Mohan Babu : ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్

Mohan Babu : ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్
X

జల్‌పల్లి ఘర్షణలో అస్వస్థతకు గురైన సినీ నటుడు మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు.మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరారు. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని, వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. బీపీ ఎక్కువగా ఉందని.. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని వెల్లడించారు. రెండ్రోజుల చికిత్స తర్వాత గురువారం మధ్యాహ్నం డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఆయన పోలీసు విచారణకు హాజరు కాకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags

Next Story