Mohan Babu: సినిమా టికెట్ల ధరలపై ఘాటుగా రియాక్ట్ అయిన మోహన్ బాబు.. త్వరలోనే ముఖ్యమంత్రులతో భేటీ..!

Mohan Babu (tv5news.in)
Mohan Babu: సినిమా టిక్కెట్ల రేట్ల ఇష్యూలో.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు పెదవి విప్పారు. ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండలేనని మెగాస్టార్ చిరంజీవి కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే బహిరంగ లేఖ రాశారు. తన మౌనం చేతకానితనం, చేవలేనితనం కాదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదంటూ లేఖలో పేర్కొన్నారు.
పరిశ్రమలో అందరూ సమానమేనని ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదన్నారు. ప్రస్తుత రేట్ల విధానంతో సినిమాలు నిలబడడం కష్టమన్నారు. చిన్న సినిమాలు సైతం ఆడాలి, పెద్ద సినిమాలూ ఆడాలన్నారు. దీనిరి సరైన ధరలు ఉండాలన్నారు. అందరూ కలిసి రావాల్సిన టైం వచ్చిందని.. అందరూ ముందుకు వస్తే కలిసి నడుద్దామంటూ పిలుపునిచ్చారు.
ఇలాంటి కీలక టైమ్‌లో నిర్మాతలు ఏమయ్యారని ప్రశ్నించిన మోహన్‌బాబు.. వాళ్లు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ ఇష్యూను భుజాల మీద వేసుకోకుండా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు ఉందో కూడా అర్థం కావడం లేదన్నారు. రండి ఇద్దరు సీఎంల దగ్గరకు వెళదాం, సమస్యలు చెప్పుకుందామంటూ రిక్వెస్ట్ చేశారు మోహన్ బాబు.
కలిసి సినిమాని బతికిద్దాం pic.twitter.com/i6Z421REqA
— Mohan Babu M (@themohanbabu) January 2, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com