Khushi Kapoor : మామ్ సినిమా సీక్వెల్.. ఖుషీకపూర్ పై ట్రోల్స్

అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీకపూర్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీదేవి నటించిన మామ్ సినిమా సీక్వెల్ లో ఖుషి నటిస్తుందని ఆమె తండ్రి, శ్రీదేవి భర్త బోణీకపూర్ ప్రకటించారు. అయితే దీనిపై అభిమానులు గుస్సా అవు తున్నారు. ఈ వ్యాఖ్యల పై నెటిజెన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. శ్రీదేవి నటవారసత్వాన్ని నిలబెట్టడం అంత ఈజీ కాదంటున్నారు. ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన ఖుషికపూర్ ఆ తర్వాత 'లవ్ యాపా 'తో వెండి తెరకు పరిచయమైంది. ఇది తమిళ చిత్రం లవ్ టుడేకి రీమేక్. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన నటించింది. తాజాగా సైఫ్ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన 'నాద నియాన్' అనే రొమాంటిక్ కామెడీలో నటించింది. ఖుషీ వరుస చిత్రాలలో నటిస్తున్నా ఫలితం శూన్యం. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మారాయి. ముఖ్యంగా ఇటీవల చయమవుతున్న బాలీవుడ్ స్టార్ల వారసులు ఎవరూ ఆడియెన్స్ ని మెప్పించడంలో విజయవంతం కాలేదు. ఖుషీ కపూర్ లుక్స్ పరంగా ఓకే అనిపిస్తున్నా నటన పరంగా ఆశించిన రేంజులో లేదు. ఇదే అభిమానుల ఆగ్రహానికి కా రణమైందని టాక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com