Actress : తల్లయిన పిల్ల జమీందార్ బ్యూటీ.. మగబిడ్డకు జన్మ

పిల్ల జమీందార్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ హరిప్రియ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుందీ బ్యూటీ. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన హిట్ సినిమా జై సింహలోనూ కీలక పాత్రలో నటించి మెప్పించింది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి 2023 జనవరి 26న ప్రముఖ నటుడు వశిష్ట సింహను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత ఈ జంటకు మగ బిడ్డ జన్మించాడు. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఫోటోలు షేర్ చేసాడు హరిప్రియా భర్త నటుడు వశిష్ట సింహ. ‘బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హరిప్రియ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది' అని ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు వశిష్ఠ పెళ్లి రోజునే బిడ్డకు జన్మనివ్వడంతో ఈ హరిప్రియ వశిష్ఠ జంటకు అనందంలో మునిగి తేలుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com