Nayanthara : మెగాస్టార్ తో సినిమా.. నయన్ లో కొత్త ఉత్సాహం

Nayanthara : మెగాస్టార్ తో సినిమా.. నయన్ లో కొత్త ఉత్సాహం
X

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో ఫిమేల్ లీడ్ గా ఫిక్స్ అయ్యింది. గతంలో చిరుతో సైరా నరసింహా రెడ్డి మూవీలో చేసింది. ఆ తర్వాత గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్లో నటించింది. కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుండటం వల్ల ఈ అమ్మడు తెలుగులో చేసే వీలు కుదరలేదు. మధ్యలో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా నో చెప్పింది. ఐతే చిరంజీవి ఆఫర్ రాగానే రీ ఎంట్రీకి ఇదే కరెక్ట్ టైం అనుకుని మళ్లీ తెలుగు సినిమాకు సైన్ చేసింది నయనతార. అంతే కాదు ఈ మధ్య టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న అద్భుతాలు తెలిసిందే. అందుకే అమ్మడు ఈసారి ఒక పాజిటివ్ సైన్ తోనే టాలీవుడ్ కు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుం ది. అంతేకాదు ఇక్కడ యూనిట్ రిసీవింగ్.. ఫ్యాన్స్ హంగామా అంతా కూడా ఆమెలో కొత్త ఉత్సా హాన్ని తెచ్చిందని తెలు స్తుంది. సాధారణంగా షూటింగ్స్ మాత్రమే చేస్తూ ప్రమోషన్స్ కి నో చెప్పే నయనతార.. దర్శకుడు చెప్పగానే షూట్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక క్రేజీ వీడియో చేసింది.

Tags

Next Story