Mrinalini : క్యూట్ లుక్ లో మృణాళిని.. ఫొటోలు వైరల్

Mrinalini : క్యూట్ లుక్ లో మృణాళిని.. ఫొటోలు వైరల్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గద్దల కొండ గణేష్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాళిని రవి. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర తదితర మూవీలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. మృణాళిని చివరగా విజయ్ంటోనితో కలిసి లవ్ గురు సినిమాలో నటించింది. అటు టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలోనూ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోందీ ఈ అందాల తార. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఈ వయ్యారి భామ తన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూనే ఉంది. తాజాగా మృణాళిని సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ పిక్స్ కు ఫ్లో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ భామ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతు న్నాయి. క్యూట్, బ్యూటీఫుల్ అంటూ అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక బెంగుళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టభద్రురాలైంది. బెంగుళూరులోని IBMలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేసింది. నటనపై ఆసక్తితో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.

Tags

Next Story