Mrunal Thakur : బిపాసా బసుకు మృణాల్‌ క్షమాపణలు

Mrunal Thakur : బిపాసా బసుకు మృణాల్‌ క్షమాపణలు
X

ప్రస్తుతం సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్, బిపాసా బసు మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల మృణాల్ ఠాకూర్ టీవీ సీరియల్స్‌లో నటించే సమయంలో, అంటే సుమారు 19 ఏళ్ల వయసులో ఇచ్చిన ఒక పాత వీడియో ఇంటర్వ్యూ వైరల్ అయింది ఆ వీడియోలో మృణాల్ బిపాసా బసు గురించి మాట్లాడుతూ, "కండలు తిరిగిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు? బిపాసాను పెళ్లి చేసుకోండి. నేను బిపాసా కంటే చాలా అందంగా ఉంటాను" అని వ్యాఖ్యానించింది. బిపాసా శరీరాకృతిని ఉద్దేశించి ఆమె 'మగరాయుడిలా' ఉన్నారని పరోక్షంగా బాడీ షేమింగ్ చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి. నెటిజన్లు మృణాల్‌ను తీవ్రంగా విమర్శించారు. మృణాల్ వ్యాఖ్యలపై బిపాసా నేరుగా స్పందించలేదు. కానీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక కొటేషన్‌ను పంచుకున్నారు. "బలమైన మహిళలు ఒకరికొకరు తోడుగా నిలబడతారు," అని ఆమె పోస్ట్ చేశారు."బలమైన కండలు ఉండటం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అమ్మాయిలు బలంగా కనిపించకూడదనే పాత ఆలోచనల నుంచి బయటకు రండి" అని ఆమె మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది మృణాల్‌కు గట్టి కౌంటర్ అని నెటిజన్లు భావిస్తున్నారు. విమర్శలు తీవ్రం కావడంతో, మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా క్షమాపణలు చెప్పారు.తాను 19 ఏళ్ల వయసులో ఆ వ్యాఖ్యలు చేశానని, ఆ సమయంలో తన మాటల విలువ, అవి ఇతరులను ఎంత బాధపెడతాయో తనకు తెలియదని తెలిపారు. ఎవరినీ బాడీ షేమింగ్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని, అది ఒక సరదా సంభాషణలో వచ్చిన మాట అని చెప్పారు.ఆ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని, ఇప్పుడు అన్ని రకాల అందాలను తాను గౌరవిస్తానని మృణాల్ పేర్కొన్నారు.ఈ వివాదంపై మృణాల్ అభిమానులు, నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొంతమంది ఆమె క్షమాపణను అంగీకరించగా, మరికొందరు ఆమె నేరుగా బిపాసా పేరు చెప్పి క్షమాపణ చెప్పలేదని విమర్శించారు.

Tags

Next Story