Actor Mrunal Thakur : మృణాల్ మెరుపుల్

Actor Mrunal Thakur : మృణాల్ మెరుపుల్
X

‘నందన్ జీ నమస్తే'అనే మరాఠీ మూవీలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ మృణాల్ ఠాకూర్. పదేండ్ల క్రితం పరిశ్రమకు వచ్చిన ఈ భామ అంతకు ముందు బుల్లితెరపైనా సందడి చేసింది. రెండేళ్ల క్రితం సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి సినిమాల్లో నటించి తనకంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుందీ మరాఠీ భామ. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇన్ స్టాలో తన ఫొటోలనూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఊదారంగు చీరను ధరించి హొయలు పోతూ ఫొటోలకు పోజులిచ్చింది. మ్యాచింగ్ బ్లౌజ్తో చీర బాగా సెట్టయింది. చెవిపోగులు, లేయర్డ్ బ్యాంగిల్స్ తో అలంకరించుకుంది. తన జుట్టును నీట్గా స్టైల్ చేసి, పూలతో సింగారించుకుంది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. లవ్ సింబల్స్ పెడుతూ తమ అభిమానాన్ని ప్రేమను పంచుకుంది.

Tags

Next Story