Mrunal Thakur : ఆచితూచి డెసిషన్ తీసుకుంటున్న మృణాల్

Mrunal Thakur : ఆచితూచి డెసిషన్ తీసుకుంటున్న మృణాల్
X

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందరికీ సుపరిచితమే. సీత పాత్రలో అందరినీ మెప్పించిన ఈముద్దుగమ్మ తాను నటించే పాత్రల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుం టానని చెబుతోంది. రీసెంట్ గా హీరో శివ కార్తికేయనికి జంటగా ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది. కారణమేంటో తెలియదు కానీ ఆ మూవీని తాను వదులుకున్నదట. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మృణాల్ని ఎందుకు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు అనే ప్రశ్న తలెత్త డంతో ఈ విషయం చెప్పుకొచ్చింది. తాను చేస్తున్న పాత్రలను ఆడియన్స్ ఎంతో ఆదరిస్తున్నారంటోంది. అందుకే వచ్చిన ప్రతి సినిమా ఓకే చేయకుండా, తన పాత్రల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మరి అడుగులు వేస్తున్నానని చెప్పారు. అందుకే సినిమాకు.. సినిమాకు మధ్య గ్యాప్ వస్తుందంటోంది. ప్రజంట్ తన చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి? అనే దాని మాత్రం చెప్పలేదు.

Tags

Next Story