Prabhas Spirit : ప్రభాస్ తో సీతా రొమాన్స్

Prabhas Spirit :  ప్రభాస్ తో సీతా రొమాన్స్
X

ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మూవీస్ లైనప్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఈ రెండూ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న రాజా సాబ్ తో ఫస్ట్ టైమ్ కొత్త జానర్ ట్రై చేస్తున్నాడు. హారర్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సమ్మర్ లో ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. ఈ మూవీతో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

దీంతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) కూడా సైమల్టేనియస్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీతో ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రూపొందుతోన్న ఫౌజీలో ప్రభాస్ సైనికుడుగా కనిపించబోతున్నాడు.

ఈ రెండిటితో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ కూడా రాబోతోంది. ఈ డిసెంబర్ లోనే ఓపెనింగ్ అని చెప్పారు. కానీ ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏం లేవు. అయితే 2025 ఫస్ట్ హాఫ్ లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ లోగా ప్రభాస్ లేని సీన్స్ షూట్ చేయబోతున్నాడట సందీప్.

ఇక ఈ స్పిరిట్ లో ప్రభాస్ సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డిస్కషన్స్ కూడా అయిపోయాయని త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందంటున్నారు. నిజానికి మృణాల్ ఫౌజీలోనే నటిస్తుందనే న్యూస్ వినిపించాయి. కానీ ఆ ఛాన్స్ ఓ కొత్తమ్మాయికి వెళ్లింది. ప్రభాస్ - మృణాల్ కాంబో కూడా చూడ్డానికి బావుంటుందనే అనుకోవాలి. స్పిరిట్ లో ప్రభాస్ అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని దర్శకుడు సందీప్ ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. మరి ఈ స్పిరిట్ లో హీరోయిన్ మృణాలేనా కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Tags

Next Story