Mrunal thakur : మృణాల్ ఠాకూర్ పై బాడీ షేమింగ్ .. సెక్సీగా లేవంటూ కామెంట్స్

హీరోయిన్ గా ప్రయత్నిస్తున్న రోజుల్లో తాను కూడా బాడీ షేమింగ్ కి గురయ్యానని తెలిపింది మృణాల్ ఠాకూర్ (Mrunal thakur). బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఇబ్బంది పడ్డానంది.మరోకరితో పోలుస్తూ తన నటనను కించపరిచారని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మృణాల్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకుంది.
ఓ సాంగ్ షూట్ సమయంలో బరువు తగ్గాలని తనకు సలహా ఇచ్చారని చెప్పారని కానీ తాను తగ్గనని ఘాటుగా రిప్లై ఇచ్చానంది.గతంలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు తన బాడీని ఉద్దేశించి కామెంట్స్ చేశారని మృణాల్ ఠాకూర్ తెలిపింది.మీరు అస్సలు సెక్సీగా లేరని అన్నారని వెల్లడించింది.
మీరు చేసిన పాత్ర సెక్సీగా ఉందని.. కానీ మీరు ఆ పాత్రకు అంత దగ్గరగా కనిపించలేదని దారుణంగా మాట్లాడారని పేర్కొంది. ఓ ఫోటోగ్రాఫర్ నా పాత్రను చూడకుండానే కామెంట్ చేశాడు. మరాఠీలో మాట్లాడుతూ.. ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు? అని కామెంట్ చేశాడని తెలిపింది. కానీ ఆ తర్వాత అతను తనకు క్షమాపణ చెప్పాడంది. మృణాల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా సీతారామం సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్... గతేడాది నాని సరసన హాయ్ నాన్నతో హిట్ కొట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com