MS Dhoni : టీమ్ ఇండియా మెంటర్‌గా ఎంఎస్ ధోనీ

MS Dhoni : టీమ్ ఇండియా మెంటర్‌గా ఎంఎస్ ధోనీ
X

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు క్రిక్ బ్లాగర్ పేర్కొంది. 2021 టీ20 వరల్డ్ కప్‌కు ధోనీ టీమ్ ఇండియా మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈసారి అలా పార్ట్ టైమ్ కాకుండా ఫుల్ టైమ్ మెంటర్‌గా ఉండాలని ధోనీని కోరినట్లు బీసీసీఐ ప్రతినిధి తెలిపారని వివరించింది. సీనియర్, జూనియర్ జట్లు సహా మహిళల టీమ్స్‌కూ MSDని మెంటర్‌గా వ్యవహరించాలని కోరినట్లు తెలిపింది.ప్రస్తుతం చర్చనీయాంశం ఏంటంటే – బీసీసీఐ ఆఫర్‌ను ధోనీ స్వీకరిస్తాడా లేదా? ఎందుకంటే ధోనీకి ఐపీఎల్‌ తప్ప మిగతా క్రికెట్‌ నుంచి పూర్తిగా రిటైర్మెంట్‌ ఉంది. కుటుంబం, వ్యక్తిగత జీవితం, వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు. మెంటార్‌ బాధ్యతలు అంటే ఎక్కువ సమయం, కట్టుబాట్లు అవసరం అవుతాయి. కాబట్టి ధోనీ నిర్ణయం ఏంటనేది చూడాలి. అయితే ధోనీ మెంటార్‌గా వస్తే ఆటగాళ్లకు ఎంతో మేలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న గౌతం గంభీర్ (Gautam Gambhir) ఇందుకు అంగీకరిస్తాడా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మెంటార్‌ ధోనీ విషయంలో గంభీర్ సానుకూలంగా ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ధోనీ అంటేనే గంభీర్‌కు పడదు.

Tags

Next Story