My Baby : జులై18న థియేటర్లలోకి మై బేబీ!

My Baby : జులై18న థియేటర్లలోకి మై బేబీ!
X

తమిళంలో విజయం సాధించిన డీఎస్ఏ మూవీ తెలుగులో మై బేబీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే విడుదలై విమర్శ కుల ప్రశంసలు అందుకుంది. హాస్పిటల్స్ లో పిల్లల్ని మాయం చెయ్యడం, వారిని వేరే చోట అమ్మేయడం.. ఈ ఘటనల నుంచి ఎలా జాగ్రత్త పడాలో వివరిస్తూ సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలో అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా వంటి అనువాద హిట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్ కొండేటి, ఇప్పుడు 'మై బేబీ' సినిమాను ఎస్.కె. పి క్చర్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా తెలుగు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18 న థియేటర్లలో విడుదల కానుంది. ఇక భావోద్వేగాలతో పాటు థ్రిల్ కలగలిపిన స్క్రీన్ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.

Tags

Next Story