Shanmukh Jaswanth: మై లవ్ ఈజ్ గాన్ అంటున్న షణ్ముఖ్.. అల్లు అర్జున్‌ని మించి పోయేలా..

Shanmukh Jaswanth: పచ్చని సంసారంలో నిప్పులు పోసినట్లు.. ఇద్దరు ప్రేమికుల మధ్య బిగ్‌బాస్ చిచ్చుపెట్టాడు.. స్క్రీన్ మీద సిరి, షణ్ముఖ్‌ల రొమాన్స్ చూసి దీప్తి సునయన నొచ్చుకుంది. తన లవర్ వేరెవరికో ముద్దులు పెడుతుంటే చూసి తట్టుకోలేకపోయింది. అదే అతడి కొంప ముంచింది. షణ్నూ బయటకొచ్చాక ఏ మాత్రం ఆలోచించకుండా దీప్తి బ్రేకప్ చెప్పేసింది.
ఆ బాధ భరించలేని షణ్నూ మధ్య మధ్యలో ఏవో పోస్టులు పెడుతూ తనని తాను ఓదార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే స్టా్ర్ మా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఈవెంట్‌ని ప్లాన్ చేసింది. ఇందులో షణ్నూ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఎమోషన్‌తో డ్యాన్స్ చేశాడు.
ఆర్య2లో ఈ పాటకు అల్లు అర్జున్ చేసిన స్టెప్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా షణ్నూ కూడా చేశాడు.. ఓ దశలో అల్లు అర్జున్‌ని మించి పోయేలా చేశాడనిపిస్తుంది. షణ్నూ అభిమానులు కచ్చితంగా ఆ మాట అంటారు. అంత ఈజ్‌తో అంత ఎమోషన్‌ని పండించాడు షణ్ముఖ్.
ఇక ఈషోకి యాంకర్‌గా వ్యవహరించిన రవి మై లవ్ ఈజ్ గాన్ అంటున్నావు.. నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా అని అడుగుతాడు. ప్రేమలో సారీ, థ్యాంక్స్, బాయ్ అని ఎవరికి చెబుతావ్ అని షణ్నూని ఇరికించేశాడు. మరి రవి అడిగిన ప్రశ్నలకు షణ్నూ ఏం సమాధానం చెప్పాడో తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com