Rajamouli : నాది వన్ సైడ్ లవ్.. రాజమౌళి తొలిప్రేమ

Rajamouli : నాది వన్ సైడ్ లవ్.. రాజమౌళి తొలిప్రేమ
X

దర్శకధీరుడు రాజమౌళి తన తన తొలిప్రేమ గురించి చెప్పుకొచ్చాడు. ఇటీవల ఆయన ది రానా దగ్గుబాటి అనే టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆయన తన తొలిప్రేమ గురించి చెప్తూ "నేను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయి అంటే చాల ఇష్టం ఉండేది. ఆ విషయం స్కూల్ లో అందరికీ తెలుసు ఒక్క ఆ అమ్మాయికి తప్పా. కనీసం ఆమెతో మాట్లాడే అవకాశం కూడా రాలేదు. చాలా భయమేసేది. ఒకే ఒకసారి ట్యూషన్ ఫీజు కట్టావా అని ఒకేఒకసారి మాట్లాడాను అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా 2025 జనవరిలో మొదలుకానుంది.

Tags

Next Story