Nabha Natesh : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నభా
అందం, మెస్మరైజింగ్ లుక్స్ లో టాలీవుడ్ లో పేరుతెచ్చుకున్న కన్నడ భామ నభా నటేశ్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా వచ్చిన వజ్రకాయ మూవీలో 19 ఏళ్ల వయసుకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 2019లో సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. రవితేజతో డిస్కో రాజా, బెల్లంకొండ శ్రీనివాస్తో అల్లుడు అదుర్స్ లాంటి సినిమాలు నభా నటేష్ కెరీర్ను గాడితప్పేలా చేశాయి. ఒకవైపు చేసిన సినిమాలు డిజాస్టర్.. మరోవైపు యాక్సిడెంట్ కారణంగా చాలా రోజులు ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో క్రేజీ తెచ్చుకున్న ఈ కన్నడ పిల్ల తర్వాత ఆ హిట్ ను కెరీర్ గా మలుచుకోలేక పోయింది. హాట్ హాట్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ భామకు చాలినన్ని అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవల కమెడియన్ ప్రియదర్శితో 'డార్లింగ్' అనే సినిమాలో నభా నటేష్ నటించింది. కానీ.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం నిఖిల్తో చేస్తున్న పీరియాడిక్ మూవీ స్వయంభూ పైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com