Nabha Natesh : నాభా లవ్ అఫైర్ అంటూ ఫొటోలతో రచ్చ

Nabha Natesh : నాభా లవ్ అఫైర్ అంటూ ఫొటోలతో రచ్చ
X

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఈ అమ్మడు ఇటీవల ‘డార్లింగ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజెంట్ నభా నటేష్ నిఖిల్‌తో ‘స్వయంభు’చిత్రంలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా నభా తన లవ్ ఎఫైర్స్ గురించి తెలుపుతూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘‘ఆరు గజాలతో నా ప్రేమ వ్యవహారం. మూడు తరాలు నృత్యం చేసే చోట నా అజ్జి జ్ఞానం, నా అమ్మ అనుగ్రహం, నా కలలు అన్నీ ఒక్కటిగా ప్రవహిస్తాయి. చీర అనేది వస్త్రం కాదు, నా గుర్తింపు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం నభా చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story