Naga Chaitanya and Shobhita wedding : సన్నిహితుల మధ్య వైభవంగా నాగచైతన్య, శోభిత వివాహం

అక్కినేని వారసుడు నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీరి వివాహం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు, ఎస్.ఎస్ రాజమౌళి, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు.
పెళ్లి వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు నాగార్జున. అభిమానులు, నెటిజన్లు విషేస్ తెలియజేస్తున్నారు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. "శోభిత, చైతన్యలు కలిసి అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణం. చైతన్యకి అభినందనలు. శోభితకు మా కటుంబంలోకి స్వాగతం. మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా సంతోషాన్ని తెచ్చారు. శతజయంతికి గుర్తుగా స్థాపించిన ఏఎన్నార్ విగ్రహం చెంత ఆయన ఆశీర్వాదంతో ఈ వేడుక జరగడం సంతోషాన్ని తీసుకువచ్చింది. ఈ ప్రయాణంలో అడుగడుగునా ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం మాతో ఉన్నట్లుగా అనిపిస్తోంది" అని నాగార్జున స్పందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com