Naga Chaithanya : చైతూ చేతి చేపల పులుసు.. వీడియో వైరల్

అక్కినేని నాగచైతన్య, సాయిపల్ల వి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేట్రికల్ గా విడుదల కానుంది. ఏపీకి చెందిన కొంత మంది జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లి, అనుకో కుండా పాకిస్థాన్ బోర్డర్లోకి ప్రవేశిస్తారు. వారిని అక్కడ పాకిస్థాన్ నేవీదళం అరెస్ట్ చేయడం, అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎలా బయటపడ్డారనే కథాంశంతో రూపుదిద్దుకుంటుందీ సినిమా. ఈ సినిమా కోసం నాగ చైతన్య శ్రీకాకుళం యాస నేర్చేసుకున్నాడు. సినిమాలో ఎక్కువ భాగం శ్రీకాకుళం, విశాఖలో షూట్ చేశారు. షూటింగ్ సందర్భంగా విశాఖలో స్థానికులతో మాట్లాడిన షూటింగ్ పూర్తయ్యేలోగా తానే ఉత్తరాంధ్ర స్టైల్ లో చేపల పులుసు వండి వడ్డిస్తానని మాటిచ్చాడు. షూటింగ్ తుది అంకానికి చేరడంతో చైతూ చేపల పులుసు వంట వడ్డించాడు. ఈ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ విడుదల చేసింది. నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా తండేల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సాంగ్స్ కు అద్భుత స్పందన లభించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com