Nagarjuna : మనం అంటూ సినీ కుటుంబాన్ని ఏకం చేస్తున్న నాగార్జున

Nagarjuna : మనం అంటూ సినీ కుటుంబాన్ని ఏకం చేస్తున్న నాగార్జున
X

తెలుగు చలన చిత్ర లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోలను ఒక వేదికపై చూపించబోతున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలను ఆహ్వానించారు కింగ్ అక్కినేని నాగార్జున. అక్కినేని శత జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆహ్వానించారు హీరో నాగార్జున. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందించబోతున్నారు నాగార్జున. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. అక్కినేని శత జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు హీరో నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేదిక నిర్మిస్తున్నారు.

Tags

Next Story