సినిమా

Bigg Boss 5 Telugu: షన్నూతో కనెక్షన్ ఏర్పడింది.. నాగ్ ప్రశ్నలకు సిరి సమాధానం..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.

Bigg Boss 5 Telugu (tv5news.in)
X

Bigg Boss 5 Telugu (tv5news.in)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ఇందులో సిరి, షన్నూల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే.. సిరి, షన్నూ ముందు నుండే ఫ్రెండ్స్. 19 తెలియని వ్యక్తుల మధ్య ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కాస్త బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ వీళ్ల పద్ధతి చూస్తుంటే అలా లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సిరి, షన్నూ ఎప్పుడూ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారి లాగా గొడవపడుతూనే ఉంటారు. అది ప్రేక్షకులకు పేషెన్స్ లేకుండా చేస్తోంది. అంతే కాక ఇటీవల వాళ్లిద్దరి మధ్య జరిగిన గొడవలో సిరి తట్టుకోలేని బాధతో వాష్‌రూమ్‌లోకి వెళ్లి తన తలను గోడకు గట్టిగా కొట్టుకుంది. అసలు ఈ ప్రవర్తన ఏంటని తన మీద బిగ్ బాస్ ప్రేక్షకులు చిరాకుపడుతున్నారు. ఇదే విషయాన్ని ఈరోజు హోస్ట్ నాగార్జున కూడా ప్రస్తావించారు.

సిరిని ఎందుకలా చేసావంటూ నాగ్ ప్రశ్నించారు. దానికి సిరి దగ్గర సమాధానం లేక మౌనంగా నిలబడింది. తాను ఏమైనా చెప్పాలనుకుంటే కన్ఫెషన్ రూమ్‌కు వచ్చి చెప్పొచ్చని నాగ్ అన్నారు. దీంతో సిరి కన్ఫెషన్ రూమ్‌లో తన లైఫ్ ఏంటో తనకు తెలిసినా కూడా షన్నూతో కనెక్షన్ ఏర్పడిందని.. దానికి తాను ఏం చేయలేకపోతోందని కన్నీళ్లు పెట్టుకుంది.

సిరితో మాట్లాడని తర్వాత షన్నూను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు నాగార్జున. అసలు ఈ ప్రవర్తన ఏంటని తనను ప్రశ్నించాడు. దీంతో షన్నూ.. తన గర్ల్‌ఫ్రెండ్ దీప్తీని మిస్ అవుతున్నానంటూ బాధపడ్డాడు. అందుకే ఇలా జరుగుతుందేమో అని చెప్పాడు. ఇది విన్న నాగార్జున అంత మిస్ అయితే వెళ్లిపో అంటూ బిగ్ బాస్ గేట్లు తెరిచాడు. ఈ ఎపిసోడ్ తర్వాత అయినా సిరి, షన్నూ ప్రవర్తనలో మార్పు వస్తుందేమో, ఎవరి గేమ్ వారు ఆడదారేమో అని అభిమానులు అనుకుంటున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES