OTT Release : ఓటీటీలోకి నాగార్జున నా సామిరంగ

OTT Release : ఓటీటీలోకి నాగార్జున నా సామిరంగ

ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి నా సామిరంగ (Naa SaamiRanga). కింగ్ నాగార్జున (King Nagarjuna) నటించిన ఈ సినిమా రూ. 50 కోట్లు సాధించి .. డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. త్వరలో ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఎప్పటి నుంచి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఫిబ్రవరి 12 లేదా 15 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీని ఓటీటీ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.

నా సామిరంగ మలయాళీ రీమేక్. విజయ్ బిన్నీ దర్శకుడు. అల్లరి నరేష్ (Allari Naresh), రాజ్ తరుణ్ (Raj Tarun) కీలక పాత్రలు పోషించారు. ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి (Keeravani) సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story