Naga Shaurya : నాగశౌర్య కొత్త మూవీ బ్యాడ్ బాయ్ కార్తీక్

Naga Shaurya : నాగశౌర్య కొత్త మూవీ బ్యాడ్ బాయ్ కార్తీక్
X

క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ సినిమాతో 2011లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగశౌర్య. తర్వాత చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే తదితర చి త్రాల్లో నటించాడు. రెండేళ్ల క్రితం రంగబలి సినిమాలో కనిపించాడు నాగశౌర్య. బాక్సా ఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో సరైన సక్సెస్ అం దుకోవడం కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వరుస ప్రాజెక్టులు ఓకే చేశారు. ఆయన కథానాయకుడిగా రామ్ దేసిన దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బుధవారం నాగ శౌర్య పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర బృందం టైటిల్ పోస్టర్ విడుదల చేసింది.ఈ చిత్రానికి 'బ్యాడ్ బాయ్ కార్తిక్' అనే టైటిల్ ఖరారు చేశారు. యూత్ఫుల్, యాక్షన్ ఎంటర్టైనర్గా విభిన్నమైన కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. శౌర్య యాంగ్రీ లుక్లో కనిపించారు. వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం నాగశౌ ర్యచేతిలో పోలీసు వారి హెచ్చరిక, నారీ నారీ నడుమ మురారి, ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి సినిమాలు కూడా ఉన్నాయి.

Tags

Next Story