Nandamuri Balakrishna : 65వ వసంతంలోకి బాలయ్య!

Nandamuri Balakrishna : 65వ వసంతంలోకి బాలయ్య!
X

నటరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఇవాళ. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో మాస్ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ నేడు 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 1974లో వచ్చిన “తాతమ్మ కల” సినిమా ద్వారా బాలయ్య బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి విజయాన్ని 'మంగమ్మగారి మనవడు' చిత్రంతో అందుకుని పౌరాణిక, జానపద, సాంఘిక, సైన్స్ ఫిక్షన్ వంటి ఎన్నో విభిన్న శైలుల చిత్రాల్లో నటించి తన వేర్స టిలిటీని నిరూపించుకున్నారు. ముఖ్యంగా 1991లో విడుదలైన ‘ఆదిత్య 369' సినిమా బాలయ్యకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిం ది. అనంతరం రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం, పెద్దన్నయ్య, పవిత్ర ప్రేమ వంటి చిత్రాలు కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యాయి. ఇప్పటివరకు బాల కృష్ణ 109 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో పాటు మరో సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు నేపథ్యంలో తాజాగా విడుదలైన అఖండ 2 టీజర్ అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఉంది. ఆ టీజర్ ను చూసిన అభిమానులు జై బాలయ్య.. జై జై బాలయ్య అనే స్లోగన్స్ తో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు.

Tags

Next Story