Re Release : మార్చి 02న సమరసింహారెడ్డి రీ రిలీజ్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన సమరసింహారెడ్డి (Samarasimhareddy) రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాను మార్చి 02న 4K వెర్షన్ లో రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సిమ్రాన్, అంజలా జవేరీ హీరోయిన్లుగా నటించగా... జయప్రకాశ్ రెడ్డి విలన్ గా నటించారు.
1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా టాలీవుడ్‌లో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. సమరసింహారెడ్డి రూ. 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా రూ. 15 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కి కాసులు కురిపించింది. 73 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సమరసింహారెడ్డి 29 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది. బాలయ్య ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం ఇది.
ఈ రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన డబ్బులను నందమూరి బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి రీ రిలీజ్‌తో సమరసింహారెడ్డి ఎంత రాబడుతుందో చూడాలి.సమరసింహారెడ్డి రీరిలీజ్ అవుతుందని తెలిసి బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. థియేటర్లో మరోసారి కాక రేపేందుకు ఫ్యాన్స్ అంతా ప్లాన్ చేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com