Natural Star Nani : సరికొత్తగా 'ది ప్యారడైజ్'

Natural Star Nani : సరికొత్తగా ది ప్యారడైజ్
X

నేచురల్ స్టార్ నాని, దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా మొదలైంది ఈ సినిమా. తాజాగా, ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్లు హీరో నాని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టాడు. నాని, ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల కలయికలో డిజైన్ చేసిన టైటిల్ లుక్ అంచనాలను రెట్టింపు చేస్తుంది. కేవలం టైటిల్ విషయంలోనే కాదు కథ, కథనాల విషయంలో ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని పంచుతుందట ఈ సినిమా. ప్రస్తుతం నానీ షేర్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ 2025లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇంకా ఇందులో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story