The Paradise : నాని ‘ది ప్యారడైజ్’లో ఉప్పెన బ్యూటీ?

‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. హీరో నానిని సరికొత్తగా చూపిస్తోండగా తాజాగా మరో న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించనుందని తెలుస్తోంది. ఇదే విషయమై హీరోయిన్‌తో దర్శకుడు చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ‘దసరా’లో కీర్తిని డీగ్లామర్‌గా చూపించగా ఈ మూవీలో బేబమ్మను ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందట సినిమా. అన్నట్టు ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ‘ది ప్యారడైజ్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌కు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా నాని కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ అని టాక్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే కథానాయికను ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com