Rashmika Mandanna : పుష్ప 2కి కూడా నేషనల్ అవార్డు గ్యారంటీ : రష్మిక మందన్న
X
By - Manikanta |29 Nov 2024 6:00 PM IST
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. "ప్రస్తుతం పుష్ప రాజ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆయన రాలేకపోయారు. ఆ భాద్యత నేను తీసుకున్నాను. పుష్ప పార్ట్ 1కి బన్నీకి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు పుష్ప 2కి కూడా వస్తుందని భావిస్తున్నాను" అని తెలిపింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com