Natural Star Nani : కొత్త లుక్ లో హీరో నాని

Natural Star Nani : కొత్త లుక్ లో హీరో నాని
X

నేచురల్ స్టార్ నాని తన 32వ సినిమా "హిట్: ద 3 కేస్” చిత్రంలో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. చిత్రబృందం యాక్షన్ ప్యాక్ పోస్టర్ ని విడుదల చేసింది. నాని లుక్ తో ఈ పోస్టర్ అదిరిపోయింది. హిట్ సిరీస్ పోలీస్ ఆఫీసర్ గా నాని పాత్రని పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి ట్రెమండస్ స్పందన వచ్చింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది మే ఒకటిన ఈ సినిమాను విడుదల చేస్తారు.

Tags

Next Story