Nayanthara Movie OTT : నయన్ మూవీ ఓటీటీలోనే రిలీజ్!

మలయాళం సినిమాతో 2003లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీమణి నయనతార. పలు చిత్రాల్లో గ్లామరస్ రోల్స్ చేసి తనదైన ముద్ర వేసుకుందీ భామ. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల్లో సాలిడ్ క్రేజ్ను దక్కించుకుంది. తాజాగా ఇప్పుడు ఆమె నటిస్తున్న ఓ సినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ దర్శ కత్వంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యా క్ప్ థ్రిల్లర్ మూవీ 'టెస్ట్'. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాలో నయనతార లీడ్ రోల్లో నటి స్తోండగా, ఆమెతో పాటు మాధవన్, సిద్ధా ర్డ్, మీరా జాస్మిన్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుందట. దీనికి సం బంధించిన ఓ అఫీషి యల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రా నుందంటున్నారు. ఇప్ప టికే విడుదలైన అప్ డెట్స్కి మంచి ఆదరన లభించగా.. ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని.. అందుకే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అయితే బాగుం టుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మూవీ ఓటీటీ స్ట్రెయిట్ ప్లాట్ ఫామ్.. రిలీజ్ డెట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com