Nayanthara : నయన్ ఎదురుచూపులు

X
By - Manikanta |25 Nov 2024 5:15 PM IST
సినీ ఇండస్ట్రీకి చెందిన చిన్న ఆర్టిస్టులైనా బయటక కనిపిస్తే జనం వారితో సెల్ఫీలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ కపుల్.. రెస్టారెంట్ కు వెళ్తే మాత్రం ఎవ్వరూ గుర్తుపట్టలేదు కదా.. గుర్తించిన వారైనా ఎవరూ పట్టించుకోలేదు. వారు ఎవరో కాదు. లేడీ సూపర్ స్టార్ నయనతార, స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్. తాజాగా వీరిద్దరూ కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. ఓ చిన్న దాబాలో ఫుడ్ తింటూ కనిపించారు. అక్కడ వీరిని ఎవరూ గుర్తుపట్టలేదు. కొందరు గుర్తుపట్టినా వీరిని పట్టించుకోలేదు దాదాపు అరగంటపాటు ఫుడ్ కోసం ఎదురుచూసి తర్వాత ఫుడ్ ఆరగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com