Nayanthara : ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోలేదు.. ఖండించిన నయనతార

Nayanthara : ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోలేదు.. ఖండించిన నయనతార
X

తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలను నటి నయనతార ఖండించారు. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన నయన్..‘నా కనుబొమలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ప్రతి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్లకు ముందు వాటిని మార్చుతుంటాను. వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాను. కనుబొమల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకొని ఉంటారు. వాళ్లు అనుకున్నది నిజం కాదు.. అలాగే డైటింగ్‌ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు. ఒక్కోసారి బుగ్గులు వచ్చినట్లు కనిపిస్తుంటాయి. మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తుంటుంది. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు.. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ ఉండదు’’ అని సరదాగా చెప్పుకొచ్చింది.

Tags

Next Story