Madras High Court : నయనతార డాక్యుమెంటరీ వివాదం.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

హీరో ధనుష్ తమపై వేసిన కాపీరైట్ దావాను తిరస్కరించాలంటూ మద్రాస్ హైకోర్టులో నెట్‌ఫ్లిక్స్ వేసిన పిటిషిన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. హీరోయిన్ నయనతార కెరీర్, వ్యక్తిగత జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. తాను నిర్మించిన ‘నేనూ రౌడీనే’ సినిమా క్లిప్పింగ్స్‌ను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ధనుష్ కోర్టుకెక్కారు. దీనిపై స్పందించిన నయనతార ధనుష్ ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రిలీజ్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది. ఇప్పుడీ విషయంలో ధనుష్ కు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. మరి దీనిపై నయనతార ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..నయనతార డాక్యుమెంటరీ వివాదంకాగా నయనతార జీవిత కథ ఆధారంగా తెరకెకిన డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ గతేడాది నవంబర్ లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ డాక్యుమెంటరీలో నయన తారతో కలిసి పనిచేసిన నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com