Nayanthara : ఆ సినిమానే విగ్నేష్ను భర్తగా ఇచ్చింది

X
By - Manikanta |23 Oct 2024 12:45 PM IST
స్టార్ హీరోయిన్ నయనతార ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె నటించిన ‘నేను రౌడీనే’ సినిమా విడుదలై 9 ఏళ్లు పూర్తయిన సందర్బంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘‘నా జీవితాన్ని మార్చేసిన సినిమా ‘నేను రౌడీనే’. నా కెరీర్‌ను గొప్పగా మలచిన ఈ సినిమా 9 ఏళ్ల క్రితం విడుదలై హిట్ అయి మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. అంతేకాకుండా ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను భర్తగా ఇచ్చింది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం నయన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com