Nayanthara : వివాదంలో నయనతార

Nayanthara : వివాదంలో నయనతార
X

సౌత్ ఇండియన్ లేడీ అమితాబ్ బచ్చన్ నయనతార వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మందార పువ్వుతో చేసిన టీ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఇన్స్టాలో పోస్టు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో డాక్ గా పేరుగాంచిన డాక్టర్ సిరియాక్ ఫిలిప్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. "అభిమానులను మీ సలహాలతో తప్పుదోవ పట్టిస్తున్నావంటూ నయనతారపై మండిపడ్డాడు. 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ను ఆమె తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె మాటల్లో నిజం లేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ వివాదంపై నయనతార పరోక్షంగా స్పందింస్తూ "మూర్ఖులతో ఎప్పుడూ వాదించకూడదు. వాళ్ల తమ స్థాయికి మిమ్మల్ని దిగజార్చి తమ అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు" ' అని రాసుకొచ్చారు.

Tags

Next Story