Nayanthara : స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన నయన్

తన భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ బర్త్ డే సందర్భంగా కోలీవుడ్ బ్యూటీ నయనతార కొన్ని స్పెషల్ ఫొటోలు షేర్ చేశారు. ఇందులో ఆమె విఘ్నేశ్ ను కిస్ చేస్తూ కనిపించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. క్యూట్ కపుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2015లో విఘ్నేశ్ డైరెక్షన్ లో వచ్చిన ‘నానుమ్ రౌడీదాన్’ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీరిమధ్య ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఆ తర్వాత ఏడేళ్ల పాటు లవ్ చేసుకున్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. సరోగసీ విధానంలో నయనతార ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. విఘ్నేశ్ ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. నయనతార ‘టెస్ట్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘తని ఒరువన్2’ సినిమాలతో బిజీగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com