Mana Shankaravara Prasad : ట్రైలర్స్ తో సైలెంట్ అవుతున్న నెగెటివ్ టాక్స్

సినిమాలు వస్తున్నాయి అంటే చాలు.. చాలామంది నెగెటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడంలో ముందుంటారు. కావాలని కొందరు ఈ తరహా టాక్స్ వ్యాపిస్తుంటారు. ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ విపరీతంగా కనిపిస్తోంది. ఇందుకోసం కొందరు డబ్బులు తీసుకుని మరీ పని చేస్తుంటారు. అలా ఈ సంక్రాంతికి కూడా ఐదు తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీంతో వీటిపైన కూడా నెగెటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడంలో ముందున్నారు చాలామంది. అయితే పాటలు, టీజర్స్ లేదంటే సినిమాల కంటెంట్స్ పైనే వీళ్లంతా ఎక్కువ ఫోకస్ చేస్తుండటం మామూలే. అయితే ఓ రెండు సినిమాల విషయంలో మాత్రం ఆ తరహా బ్యాడ్ కామెంట్స్ పెట్టే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆగిపోయాయి. ఆ రెండు సినిమాలు రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు.
ఈ రెండు సినిమాలపై కూడా విపరీతమైన నెగెటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు. ఆ హీరోల లుక్స్ దగ్గర్నుంచీ ఇది మొదలైంది. రాజా సాబ్ ట్రైలర్ పై కూడా నెగెటివ్ టాక్ క్రియేట్ చేశారు. అయితే రెండో ట్రైలర్ తర్వాత ఈ నెగెటివ్ టాక్ అంతా ఆగిపోయింది. అంటే ఆ ట్రైలర్ తో అందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం మెయిన్. ఆ కారణంగా ఈ మూవీ నెగెటివిటీ అంతా ఆగిపోయింది. కొందరి కావాలనే చేసిన ప్రయత్నాలు కూడా దెబ్బకొట్టాయి. ట్రైలర్ బావుంది కదా.. ఇందులో ఏం తేడా కనిపించింది అంటూ కామన్ ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రశ్నలే అందుకు కారణం.
ఇక మన శంకరవరప్రసాద్ గారు విషయంలోనూ ఇదే కనిపిస్తోంది. ట్రైలర్ తర్వాత చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే మాగ్జిమం పాజిటివ్ టాక్ రావడం ఇంపార్టెంట్. ముఖ్యంగా మెగాస్టార్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. అతని స్టైల్, టైమింగ్ కూడా బావున్నాయి. ఇదే విషయం పై సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ రావడం ఆగిపోయింది. దీంతో పాటు వెంకీ ఎంట్రీతో పాటు ఆయనతో డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. సో.. ముందు ముందు రాబోతున్న మూడు సినిమాల ట్రైలర్స్ తర్వాత కూడా నెగెటివ్ టాక్స్ ఆగిపోతాయేమో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

